ఏపీ టూరిజం హబ్ గా మారబోతోంది: దుర్గేష్


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, సమగ్ర పర్యాటకాభివృద్ధే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికపై మంత్రి తనదైన శైలిలో ప్రసంగించి ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు.
పర్యాటక రంగంలో ఉత్తేజం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిందని తద్వారా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ పర్యాటకరంగానికి కూడా వర్తింపజేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీలో పర్యాటకాభివృద్ధి కోసం నూతన టూరిజం పాలసీ తీసుకువచ్చామని వివరించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్ హబ్‌లు, థీమాటిక్ అప్రోచ్ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన తదితర విభిన్న కార్యక్రమాలు, పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని పెట్టుబడిదారులు ముందుకు రావాలని కోరారు.
పర్యాటకాన్ని, పర్యావరణాన్ని సమ్మిళితం చేసి యువతకు ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments