ఏయు మాజీ వీసీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ విసి ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎయు మాజీ విసి ప్రసాదరెడ్డి అవినీతి, అక్రమాలపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు.
ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం రూ.20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగమైందని, ఇస్రో నుంచి వచ్చిన రూ.25లక్షలను ఖర్చుచేసిన విషయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఫిర్యాదు అందిందని తెలిపారు లోకేష్. అవినీతి, అధికార దుర్వినియోగం, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారనే విషయాలు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు.
"మాజీ ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం వెళితే ఆయనకు స్వాగతం పలికేందుకు తరగతులు నిలిపేసి విద్యార్థులను రోడ్లపై నిలిపారు. ఎయు రిజిస్ట్రార్ తో సహా ఇల్లీగల్ అపాయింట్ మెంట్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షల నిర్వహణలో ప్రైవేటు కళాశాలల నుంచి లంచాలు తీసుకోవడం, మాజీ విసి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి అప్పటి అధికారపార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించడం, యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ల, ప్రిన్సిపాళ్లను నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగించడం వంటి తీవ్రమైన అభియోగాలు నాటి వైస్ ఛాన్సలర్ పై వచ్చాయి. దీనిపై ఇన్ చార్జి విసి ఒక కమిటీని నియమించి, అవకతవకలపై నివేదిక కోరారు." అని సభకు వెల్లడించారు లోకేష్.
ఐఐటి ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా పనిచేసిన రాజశేఖర్ గారిని ఎయు విసిగా నియమించామని.. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలను పెంచి, గత వైభవం తెస్తామన్నారు లోకేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments