close
Choose your channels

ఏపీ ప్రజలకు వైఎస్ జగన్‌ వరాల జల్లు

Wednesday, October 16, 2019 • తెలుగు Comments

ఏపీ ప్రజలకు వైఎస్ జగన్‌ వరాల జల్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ప్రజలకు వరాలజల్లు కురిపించారు. బుధవారం నాడు సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చేనేతకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ. 10 వేలు, న్యాయవాదులకు రూ.5 వేలు ప్రోత్సాహకం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల కార్పొరేషన్‌ ఏర్పాటు, జిల్లాల వారీగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

త్వరలో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం!

భేటీ అనంతరం మీటింగ్‌ వివరాలను పేర్ని నాని మీడియాకు నిశితంగా వివరించారు. ‘రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి.. ఏ కుటుంబం అయితే మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారో.. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. సీఎం వైయస్‌ జగన్‌ తన పాదయాత్రలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కేబినెట్‌లో వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం అనే పథకాన్ని రూపొందిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ మాసం లోపు జాబితా అంతా కూడా గ్రామ సభల్లో అందుబాటులో ఉంచుతాం. ఆ జాబితాలో తప్పులు ఉంటే సరిచేస్తాం. డిసెంబర్‌ 21వ తేదీ నుంచి వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఎంత మంది లబ్ధిదారులు ఉన్నా కూడా చేనేత వృత్తిగా బతుకుతున్న ప్రతి కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తాం’ అని తెలిపారు.

ఏపీ ప్రజలకు వరాల జల్లు ఇవే!

వేట నిషేధ కాలంలో రూ.10 వేలు ఆర్థికసాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.

మేకనైజ్‌డ్‌ బోట్లు, మోటార్లు లేని కుటుంబాలే కాకుండా తెప్పలపై సముద్రంలో వేటకు వెళ్తున్న కుటుంబాలను కూడా ఈ పథకంలోకి తీసుకువస్తూ మంత్రివర్గం ఆమోదించింది.

మత్స్యకారులు వేటాడే బోట్లకు వాడే డీజిల్‌ మీద లీటర్‌పై రూ.9 సబ్సిడీ ఉండగా దానికి 50 శాతం పెంచి అదనంగా ఇస్తాం.

ఏపీలోని 13 జిల్లాల్లో అందరికి సురక్షితమైన మంచినీరు అందించేందుకు వాటర్‌ గ్రీడ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఇంటికి కూడా మనిషికి 105, 110 లీటర్లు ప్రతి రోజు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనం రూ.1000 నుంచి రూ.3 వేలు పెంచి ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం చేసింది.

హోం గార్డులకు ఇచ్చే డైలీ అలవెన్స్‌ రూ.710కి పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం ఏ ఏజెన్సీకి ఇచ్చినా కూడా వసూళ్ల పర్వం కొనసాగింది. ఉద్యోగానికి ఇంత చొప్పున ఏజెన్సీలు కొల్లగొట్టాయి. ఇవన్నీ మనం చూశాం.

పలాసలో సుమారు రూ.50 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆసుపత్రి, రిసెర్స్ సెంటర్‌లో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ పోస్టుల మంజూరుకు అనుమతించాం.

డిసెంబర్‌ 11న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు ప్రోత్సాహకం రూ.5 వేలు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. లా చదువుకొని బార్‌ అసోసియేషన్‌లో ఉన్న ప్రతి న్యాయవాదికి మూడేళ్ల పాటు ప్రోత్సాహకాన్ని అందిస్తాం.

ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 3500 బస్సులు కాలం చెల్లాయి. ఆ బస్సులన్నీ కూడా తొలగించి కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

చిరుధాన్యాలు, ఆపరాల బోర్డులు ఏర్పాటుకు ఆమోదం తెలిపాం. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు బోర్డు కృషి చేస్తుంది.

పీపీఏల సంక్షోభం ద్వారా అవసరాల కంటే ఉన్న కరెంటును మూత వేసి, ఎక్కువ రేటుకు కరెంటు కొనుగోలు చేసి గత పాలకులు వ్యాపారం చేశారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కరెంటు డిస్కమ్‌లను ఆదుకునేందుకు రూ.4741 కోట్ల బాండ్లను విడుదల చేయాలని, ఇందుకోసం ఏపీ పవర్‌ ప్రాజెక్టులకు అనుమతిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

రిజిస్ట్రర్‌ విలువ రూ.7.50 కోట్లు అయితే రూ.50.05 లక్షలకు కేటాయించారు. బయట మార్కెట్‌లో రూ.25 కోట్లు విలువ ఉంటుంది. ప్రచారం కోసం నిధులు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

Get Breaking News Alerts From IndiaGlitz