close
Choose your channels

Anupama Parameswaran : బ్లాక్ శారీలో ఎదపై టాటూ కనిపించేలా, హద్దులు దాటేసిన అనుపమ.. ఫోటోలు వైరల్

Saturday, December 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Anupama Parameswaran : బ్లాక్ శారీలో ఎదపై టాటూ కనిపించేలా, హద్దులు దాటేసిన అనుపమ.. ఫోటోలు వైరల్

తెలుగు తెరపై సందడి చేస్తోన్న కేరళ ముద్దుగుమ్మల్లో ఒకరు అనుపమా పరమేశ్వరన్. ప్రేమమ్ మూవీ సూపర్‌హిట్ కావడంతో ఆ దెబ్బకు సౌత్‌లో అనుపమ పేరు మారుమోగిపోయింది. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వెల్లువలా పోటెత్తాయి. త్రివిక్రమ్ నితిన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘‘అ ఆ’’లో పదహారు అణాల తెలుగమ్మాయిలా సందడి చేశారు అనుపమ. తర్వాత ‘శతమానం భవతి’’, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించింది. అయితే మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో అనుపమ పనైపోయిందని సినీ జనాలు పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో నిఖిల్‌ సరసన చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘కార్తికేయ 2’’ సంచలన విజయం సాధించడంతో అనుపమకు మళ్లీ అవకాశాలు క్యూ కడుతున్నాయి.

రౌడీ బాయ్‌లో అనుపమ లిప్‌లాక్:

ఇదిలావుండగా... తొలి నుంచి స్కిన్ షోకు, హాట్ హాట్ సన్నివేశాలకు దూరంగా వుంటూ వచ్చింది అనుపమా పరమేశ్వరన్. అలాంటిది ఇటీవల రౌడీ బాయ్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సన్నివేశంలో ఆమె కనిపించేసరికి అనుపమ ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో ఆమె స్పందించారు. కథ, తన పాత్ర నచ్చితే ఆ తరహా సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని అనుపమా పరమేశ్వరన్ పేర్కొన్నారు.

హద్దుల్లో వుంటూ స్కిన్ షోకి అనుపమ సిద్ధమేనా:

వెండితెరపైకి కొత్త అందాలు దూసుకొస్తూ వుండటంతో అనుపమ కూడా గ్లామర్ డోస్ పెంచుతున్నట్లుగా కనిపిస్తోంది. అలాగని మరి హద్దులు దాటకుండా, డీసెంట్‌గా కనిపిస్తూనే.. అవసరమైనప్పుడు అందాలు ఆరబోయాలని ఈ మలయాళ ముద్దుగుమ్మ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే బ్లాక్ శారీలో గిలిగింతలు పెడుతోంది. అంతేనా ఎదపై వున్న టాటూ కనిపించేలా స్కిన్ షో చేసింది. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటూ అనుపమ ముక్కు పుడకతో, ఎదపై పక్షులు ఎగురుతున్న టాటూ వున్న ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడుదలకు సిద్ధమైన 18 పేజీస్:

ఇక సినిమాల విషయానికి వస్తే... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన 18 పేజీస్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులోనూ నిఖిల్ హీరో కావడం విశేషం. ఇప్పటికే వీరిద్దరూ జంటగా నటించిన కార్తీకేయ 2 సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.