close
Choose your channels

‘అణ్ణాత్త‌’ షూటింగ్ డేట్ ఎప్పటి నుంచో తెలుసా?

Friday, February 26, 2021 • తెలుగు Comments

‘అణ్ణాత్త‌’ షూటింగ్ డేట్ ఎప్పటి నుంచో తెలుసా?

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న సమయంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆగింది. త్వ‌రాత రజినీకాంత్ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకున్నాడు. కానీ ఆయ‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో రాజకీయాల్లోకి రావడం లేదని తెలియజేశాడు. దీంతో పాటు అణ్ణాత్త సినిమా షూటింగ్ మ‌రింత ఆల‌స్య‌మైంది. అప్పటి నుంచి రెస్ట్ లో ఉంటోన్న తలైవా షూటింగ్‌కి వెళ్లబోతున్నాడు. మార్చి 15 నుంచి అణ్ణాత్త షూటింగ్ స్టార్ట్ కానుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. చెన్నైలోనే సెట్ వేసి చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. న‌వంబ‌ర్ 4న ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం, వీరం, వేదాళం చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన ద‌ర్శ‌కుడు శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ, కీర్తిసురేశ్‌, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz