close
Choose your channels

విజ‌య్ ఆంటోనితో అంజ‌లి

Thursday, September 7, 2017 • తెలుగు Comments

తెలుగమ్మాయి అంజ‌లి.. త‌మిళంలోనే ఎక్కువ‌గా సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. 'అంగాడి తెరు' (షాపింగ్ మాల్‌), 'ఎంగేయుం ఎప్పోదుం' 'జ‌ర్నీ), 'ఇరైవి' త‌దిత‌ర త‌మిళ‌ చిత్రాల‌తో అంజ‌లి మంచి న‌టిగా పేరు తెచ్చుకుంది. ఇటీవ‌లే ఆండ్రియా న‌టించిన 'తారామ‌ణి' లో ప్ర‌త్యేక పాత్ర పోషించిన అంజ‌లికి.. తాజాగా మ‌రో మంచి అవ‌కాశం ద‌క్కింది.

'బిచ్చ‌గాడు' ఫేం విజ‌య్ ఆంటోని న‌టిస్తున్న స‌స్పెన్స్ డ్రామా 'కాళి' చిత్రంలో న‌లుగురు హీరోయిన్ల‌లో ఒక‌రిగా అంజ‌లి ఎంపికైంది. 'వ‌ణ‌క్క‌మ్ చెన్నై' అనే త‌మిళ‌ చిత్రాన్ని రూపొందించిన కృతికా ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ త‌మిళ‌ చిత్రం డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌య్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకుంటోంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద‌మ‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. అంజ‌లితో పాటు సునైన‌, అమృత‌, శిల్పా మంజునాథ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారీ సినిమాలో.

Get Breaking News Alerts From IndiaGlitz