close
Choose your channels

అందుకే మా నాన్న ఆత్మహత్య ...: అమృత

Monday, March 9, 2020 • తెలుగు Comments

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు మొదటి ముద్దాయి. గత ఏడాదే ఈ కేసులో జైలు నుంచి బెయిల్‌పైన విడుదలయ్యాడు. అయితే.. ఏం జరిగిందో ఏమోగానీ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు అంటున్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందిన మారుతీరావుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు మాత్రం విషంతాగి ఆయన మరణించాడని అనుమానిస్తున్నారు. అక్కడ్నుంచి ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ ఆత్మహత్యపై కుమార్తె అమృత, సోదరుడు శ్రవణ్ స్పందించారు.

అమృత స్పందన ఇదీ..
‘మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని టీవీలో చూసే తెలుసుకున్నాం. మారుతీరావు మరణవార్త అఫీషియల్‌గా మాకు సమాచారం లేదు. ప్రణయ్ హత్య నాటి నుంచి నాన్న నాకు టచ్ లో లేడు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. ఆత్మహత్య వ్యవహారంలో నిజానిజాలేంటి అనేది తెలియట్లేదు. అసలు ఎలా జరిగిందో నాకు తెలియదు. ఈ ఘటనపై ఇప్పుడే ఏమీ స్పందించలేను. అన్ని వివరాలు తెలిసాక మీడియా ముందుకు వస్తాను’ అని అమృత మీడియాకు వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు ఒకింత షాకింగ్‌కు గురి చేస్తున్నాయి.

తమ్ముడు శ్రవణ్ ఏమన్నాడంటే..
‘గతేడాది మే 15వ తేదీ నుంచి నా అన్న మారుతీ రావుతో మాటలు లేవు. మా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు గానీ, గొడవలు గానీ లేవు. పోలీసులు రెండు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. కేసు విషయంలోనే మా అన్న ఆందోళనగా ఉన్నాడు. కేసు ట్రయిల్ దశకు వచ్చింది. దాని వల్లే ఒత్తిడికి గురై ఆత్మహత్య కు పాల్పడి ఉండవచ్చు. ప్రణయ్ హత్య కేసులో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా జైలు శిక్ష అనుభవించాను. మా మధ్య ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత సంబంధాలు లేవు. ఈ రోజు ఆత్మహత్య విషయం తెలియగానే మా వదిన ను తీసుకొని నేరుగా ఉస్మానియాకి వచ్చాను’ అని శ్రవణ్ మీడియాకు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

Get Breaking News Alerts From IndiaGlitz