close
Choose your channels

బ‌న్నీ ఆరో వేలు నిజ‌మా? క్రియేష‌నా?

Wednesday, April 8, 2020 • తెలుగు Comments

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బుధ‌వారం అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల‌తో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్ట‌ర్స్‌ను విడుద‌ల చేశారు. ఇందులో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేంటంటే బ‌న్నీ ఎడ‌మ‌కాలికి ఆరు వేళ్లు ఉండటం.

అస‌లు బ‌న్నీ ఆరో వేలు వెనుకున్న క‌థేంటి? అనే దానిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది. అస‌లు బ‌న్నీ ఎడ‌మ‌కాలికి ఆరు వేళ్లు ఉన్నాయా? లేక సినిమా కోసం సుకుమార్ ఏమైనా క్రియేట్ చేశాడా? లేక నిజంగానే బ‌న్నీ ఎడ‌మ కాలికి ఆరు వేళ్లు ఉన్నాయా? అని మ‌రి దీనిపై బ‌న్నీ క్యాంప్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిది. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా కోసం బ‌న్నీ ప్ర‌త్యేకంగా చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుక‌న్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz