close
Choose your channels

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

Tuesday, December 7, 2021 • తెలుగు Comments

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమా‌పై పరిశ్రమలో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్పకు సంబంధించి ఇప్పటికే పాటలు, పోస్టర్లతోనే హైప్ తెచ్చేశాడు సుకుమార్. ఈ మేరకు సోమవారం సాయంత్రం 6.03కు ట్రైలర్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే టెక్నికల్ సమస్యల వల్ల లేట్ అయ్యింది.

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

ఈరోజు ట్రైలర్ లేదేమో అనుకుంటున్న సమయంలోనే పుష్ప ట్రైలర్‌ను అభిమానుల ముందుకు తెచ్చేశారు మేకర్స్. ట్రైలర్ టీజ్‌లో ఫాస్ట్ ఫార్వడ్‌లో కనిపించిన ఎలిమెంట్సే ఇందులో స్లో మోషన్‌లో వెళ్లాయి. విజువల్స్, బీజీఎం, ఆర్టిస్ట్‌ల మేకోవర్లు ఇంట్రిస్టింగ్‌గా వున్నాయి. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ చెప్పిన 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా..? ఫైర్'.. ‘‘ప్రభుత్వం మీకు గన్స్ ఇస్తే.. నాకు గొడ్డలి వుంది’’ అనే డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి.

పుష్ప ట్రైలర్ : ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్...!!

సుకుమార్ సినిమాల్లో ఇప్పటివరకు రావు రమేష్ నటించలేదు ఆయన మొదటిసారి ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ట్రైలర్‌లో ఆయనకి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక సుకుమార్ తన హీరోకి మళ్లీ ఒక ప్రాబ్లం పెట్టాడు. గతంలో రంగస్థలంలో రామ్‌చరణ్‌కి వినికిడి సమస్య వుండగా.. పుష్పలో అల్లుఅర్జున్‌కి గూని వున్నట్లుగా కనిపిస్తోంది. ఇక 80ల నాటి కథ కావడంతో రష్మిక, సునీల్ , అనసూయ డిగ్లామర్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ రెండు భాగాలుగా తెరకెక్కిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz