close
Choose your channels

'ఎఫ్ 3' సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

Wednesday, October 6, 2021 • తెలుగు Comments

ఎఫ్ 3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

ఎఫ్ 3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

ఎఫ్ 3 సెట్‌ను ప్ర‌త్యేక అతిథి సంద‌ర్శించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అకస్మాత్తుగా ఎఫ్‌3
సెట్ కి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల‌చేసిన ఫోటోలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడితో అల్లు అర్జున్ ముచ్చ‌టిస్తూ క‌నిపించారు. అంద‌రి ముఖాల్లో సంతోషం ఉంది. ఈ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఫుల్ ఎన‌ర్జితో ప‌ని చేస్తోంది. అల్లు అర్జున్ సెట్‌కి రావ‌డంతో టీమ్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ మ‌రింత పెరిగాయి.

ఎఫ్ 3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

F3 మూవీ సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంతో పాటు, ఇతర ఆర్టిస్టులు ఈ కీల‌క‌మైన షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ సరసన తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు, సునీల్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన తారాగణం కూడా ఉంది.
ఎఫ్ 3 సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

ఎఫ్ 2 సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 3 కోసం సూప‌ర్‌హిట్ ఆల్బ‌మ్‌ సిద్దం చేశారు దేవీ శ్రీ ప్రసాద్. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్ తదితరులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz