close
Choose your channels

కోలీవుడ్ వైపు బ‌న్నీ చూపు

Sunday, September 22, 2019 • తెలుగు Comments

కోలీవుడ్ వైపు బ‌న్నీ చూపు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ సినిమాల‌కు ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉన్నాయి. అయితే బ‌న్నీ త‌న సినిమాల మార్కెట్ ప‌రిధిని పెంచుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు. అందులో భాగంగా త‌దుప‌రి చేయబోయే చిత్రాల‌ను ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. ముఖ్యంగా బ‌న్నీ కోలీవుడ్‌లో పాగా వేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. రీసెంట్‌గా స్టార్ హీరో బిగిల్ ద‌ర్శ‌కుడు అట్లీని క‌లిశాడ‌ట‌. త‌న కోసం ఓ క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. అట్లీ కూడా ఎలాగూ తెలుగు ఎంట్రీ కోసం ఎద‌రుచూస్తున్న త‌రుణంలో బ‌న్నీ నేరుగా ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో స‌రేనన్నాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం వ‌స్తున్న కుర్ర హీరోలు కూడా యూనివ‌ర్స‌ల్ పాయింట్స్‌తో సినిమాలు చేసి కోలీవుడ్‌లోనూ స‌త్తా చాటుతున్నారు. కాబ‌ట్టే బ‌న్నీ కూడా కోలీవుడ్ మార్కెట్‌పై ప‌ట్టు సాధించుకోవాల‌నుకుంటున్నాడు. 

మురుగ‌దాస్ కూడా... మ‌రో ప‌క్క బ‌న్నీ స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌తో కూడా పనిచేయ‌బోతున్నాడ‌ని టాక్‌. ఇది వ‌ర‌కు తెలుగులో మురుగ‌దాస్ చేసిన స్టాలిన్‌, స్పైడ‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ప్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల మార్కెట్ ప‌రిధి పెర‌గ‌డంతో మురుగ‌దాస్ బ‌న్నీతో హిట్ కొట్టి డైరెక్ట‌ర్‌గా త‌న రేంజ్‌ను పెంచుకోవాల‌ని చూస్తున్నాడు.
ఈ డైరెక్ట‌ర్స్‌ ఇద్ద‌రిలో బ‌న్నీ ఎవ‌రితో సినిమా చేసినా దాన్ని గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ నిర్మించే అవ‌కాశాలున్నాయి. గ‌తంలో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ద్విభాషా చిత్రం చేయ‌డానికి బ‌న్నీ అంతా సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ చివ‌రి నిమిషంలో డ్రాప్ అయ్యాడు. అయితే ఇప్పుడు

Get Breaking News Alerts From IndiaGlitz