close
Choose your channels

సీరియస్ ప్లానింగ్‌లో అల్లు అర‌వింద్‌?

Thursday, January 30, 2020 • తెలుగు Comments

సీరియస్ ప్లానింగ్‌లో అల్లు అర‌వింద్‌?

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ సినీ రంగంతో పాటు రీసెంట్‌గా డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ‘అహా’ పేరుతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగు పెట్టిన అల్లు అర‌వింద్‌కు మ్యాట్రిక్ ప్ర‌సాద్ స‌హా టీవీ 9 రామేశ్వ‌ర్ అండ‌గా ఉన్నార‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అల్లు అర‌వింద్ త‌న‌దైన స్ట‌యిల్లో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్పీడు చూపిస్తున్నార‌ట‌. బావుంద‌నుకున్న ఓ మోస్తారు సినిమాలను కోనుగోలు చేస్తున్నార‌ట. ఇప్పటికే ‘చూసీచూడగానే’ హక్కులను దక్కించుకున్నాడు అల్లు అరవింద్. ఇక ఇత‌ర నిర్మాత‌ల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌.

సినిమాల‌ను కోనుగోలు చేయ‌డంతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌ను నిర్మిస్తున్నాడ‌ట అల్లు అర‌వింద్‌. ఇప్ప‌టికే చ‌క్రం తిప్పుతున్న అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌, జీ, స‌న్ వంటి డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు అర‌వింద్ ఓటీటీ ఎంట్రీ కాస్త ఇబ్బందిక‌ర‌మ‌నే చెప్పాలి. ఒక ప‌క్క భారీ చిత్రాల‌తో పాటు మీడియం బ‌డ్జెట్, లో బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించ‌డానికి గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ‌గా జీఏ2 పిక్చ‌ర్స్‌ను స్థాపించాడు. నిర్మాత‌గా రీసెంట్‌గా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz