close
Choose your channels

సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో పవన్‌ను టార్గెట్ చేసిన 'ఆహా'

Tuesday, December 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో పవన్‌ను టార్గెట్ చేసిన ఆహా

మిస్ అయిన సీరియల్స్, మంచి వెబ్ షోలు, థియేటర్లకు వెళ్లకుండానే కొత్త సినిమాలు ఇవన్నీ చూసేందుకు అందుబాటులో వచ్చినవే ఓటీటీలు. లాక్‌డౌన్ పుణ్యామా అని వీటికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చి పడింది. ప్రస్తుతం ఓటీటీ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు దూసుకుపోతోంది. బడా నిర్మాణ సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ప్రేక్షకులు కూడా కోవిడ్ భయం.. టిక్కెట్ల ధరల కారణంగా ఓటీటీలకు మొగ్గుచూపుతుండడంతో వీటి మార్కెట్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థల పోటీ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ నేపథ్యంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ రంగంలో వున్న వృద్ధిని గమనించి తెలుగులో మొట్టమొదటి సారిగా ‘‘ఆహా’’ పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు.కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ కంటెంట్ అందించినా జనం ఆహా వైపు అంత ఆసక్తి చూపలేదు. పలువురు సెలబ్రెటీలు రియాల్టీ షోలు నిర్వహించినా.. స్వయంగా అల్లు అర్జున్ ప్రమోట్ చేసినా దక్కని గుర్తింపు బాలయ్య ఆహాకు తీసుకొచ్చారు.

సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో పవన్‌ను టార్గెట్ చేసిన ఆహా

అన్‌స్టాపబుల్‌ 2కు గెస్ట్‌ల కొరత:

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం, ఆయన అల్లరి, గెస్ట్‌లతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఒక్క షోతోనే ఆహా‌కు లక్షలాది మంది కొత్త సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు.
దీంతో అన్‌స్టాపబుల్ సీజన్‌ 2కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే పార్ట్ 2 అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలేదనే గుసగుసలు వినిస్తున్నాయి. ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలంతా షూటింగ్‌లతో బిజీగా వుండటంతో ‘‘అన్‌స్టాపబుల్ 2’’కి గెస్ట్‌ల కొరత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెకండ్ సీజన్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వంటి వారిని గెస్ట్‌లుగా తీసుకొచ్చింది ఆహా టీమ్. అయితే రాజకీయాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి తప్పించి.. ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కి మాత్రం వారి రాక ఏమాత్రం కిక్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్‌లో ఉత్కంఠ:

సీజన్‌లో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తప్పించి మిగిలినవి ఆడియన్స్‌కు వినోదాన్ని పంచలేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రభాస్ - గోపీచంద్ గెస్ట్‌లుగా వచ్చిన ఎపిసోడ్‌ కోసం జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. న్యూఇయర్ కానుకగా డిసెంబర్ 30న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. దీని తర్వాత పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్‌లు కలిసి బాలయ్య షోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అంత వరకు బాగానే వుంది మరి.. పవన్ తర్వాత రాబోయేది ఎవరు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి వద్దా లేదు. అందుకే ఆహా టీమ్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్‌ తర్వాత అన్‌స్టాపబుల్ 2కి బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సబ్‌స్క్రైబర్లు తగ్గడంతో పవన్‌ను టార్గెట్ చేసిన ఆహా

పవన్ ఎపిసోడ్‌‌తో సబ్‌స్క్రైబర్ల లక్ష్యం :

ఈ క్రమంలోనే పవన్ ఎపిసోడ్ ద్వారా వీలైనంత మంది కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించాలని ఆహా టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. పవన్ కెరీర్‌లోని కొన్ని కాంట్రవర్సీలకు సంబంధించిన ప్రశ్నలను ప్రోమో కింద కట్ చేయించి.. అభిమానుల్లో ఉత్కంఠ కలిగించి తద్వారా లబ్ధిపొందాలని భావిస్తున్నారని ఫిలింనగర్‌లో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం అదిరిపోయే ప్రశ్నలను రెడీ చేయించే పనిలో ఆహా టీమ్ వుందని ప్రచారం జరుగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.