close
Choose your channels

Poonam Kaur:నన్ను పావుగా వాడుకుంటున్నారు.. మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు : పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు

Tuesday, September 26, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందం, అభినయం వున్నప్పటికీ కొందరు హీరోయిన్లకు స్టార్ స్టేటస్ ఎందుకో రాదు. బహుశా అది వారి దురదృష్టమే కావొచ్చు. ఇలాంటి వారిలో ఒకరు పూనం కౌర్. ఎప్పుడో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మకు చెప్పుకోవడానికి ఏ సినిమా లేదు. అయితే వివాదాలతో మాత్రం ఈమెకు ఎక్కడా లేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను టార్గెట్ చేస్తూ అప్పుడప్పుడూ సంచలన ట్వీట్స్ చేస్తూ వుంటారు పూనం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై పూనం కౌర్ ఓ లేఖ విడుదల చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

“అందరికీ నమస్కారం, ఇప్పటివరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను. సమస్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు వారి ప్రయోజనాల కోసం నన్ను ఓ పావుగా వాడాలనుకుంటున్నారు. ఇది సముచితం కాదు. గత ఎన్నికలలో కూడా ఇలాంటి వికృత చేష్టలు చేశారు. మరికొందరు పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. మరికొందరు నాయకులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కుబిడ్డను. మాకు త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. దయచేసి నన్ను మీ రాజకీయాల కోసం నన్ను లాగొద్దు.

ప్రస్తుతం నేను చేనేత కళాకారుల కోసం పనిచేస్తున్నాను. గత రెండు సంవత్సరాలుగా వారి కోసం జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత గారితో కలిసి దేశవ్యాప్త పర్యటన చేస్తున్నాను. ఇప్పటికే 15 రాష్ట్రాలు, 21 రాజకీయ పార్టీలకు సంబంధించిన 100కు పైగా పార్లమెంటు సభ్యులను కలిసి వారి మద్దతు తీసుకున్నాము. ఈ ప్రయాణంలో అనేకమంది సామాజిక ఉద్యమకారులను కలిసాము. మహిళా ఉద్యమ నేతలతో చర్చించాము. మహిళా హక్కుల కోసం నిరంతరం నేను గళం విప్పుతూనే ఉంటాను. చేనేత మరియు మహిళా ఉద్యమాలను జాతీయస్థాయిలో నిర్మించే క్రమంలో ఉన్నాము. నా వైపు నుండి ఏదైనా అప్డేట్ ఉంటే నేనే స్వయంగా తెలియజేస్తాను. దయచేసి దీనిని గమనించగలరని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, పూనమ్ కౌర్, సామాజిక కార్యకర్త” అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.