close
Choose your channels

హోటల్‌లో నరేశ్-పవిత్రా.. పట్టుకున్న మూడో భార్య, పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య

Sunday, July 3, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ నాలుగో పెళ్లి వ్యవహారంపై గత కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నరేశ్, రమ్య రఘుపతి, పవిత్రా లోకేష్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వరకు పరిస్ధితి వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం మరింత ముదిరింది. మైసూరులోని ఓ హోటల్ లో నరేశ్- పవిత్రా లోకేష్ వున్నట్లు తెలుసుకున్న రమ్య రఘుపతి అక్కడికి చేరుకుని నానా హంగామా సృష్టించారు. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ రమ్య వాగ్వాదానికి దిగారు. పవిత్రను ఏకంగా రమ్య చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అటు నరేశ్ .. రమ్యను చూసి విజిల్స్ వేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మహాబలిపురంలో ప్రత్యేక పూజలు చేసిన నరేశ్-పవిత్ర

కాగా.. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా అవన్నీ బ్రేకప్ అయ్యాయి. ప్రస్తుతం నాలుగో పెళ్లికి ఆయన సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ నటి పవిత్రా లోకేష్ ను ఆయన నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఏకంగా మహాబలిపురంలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారని ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ వీటిని వీరిద్దరూ ఖండించారు. నరేశ్ తనకు మిత్రుడని పవిత్ర.. ఆమె మంచి నటి, మంచి మనిషని నరేశ్ చెప్పారు.

ఏం లేదంటూనే జంటగా:

అయితే తమ మధ్య ఏ సంబంధం లేదంటూనే వీరిద్దరూ జంటగా కనిపిస్తుండటంతో తెలుగు, కన్నడ మీడియాలు అవాక్కవుతున్నాయి. ఇటీవల నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంటరవ్వడం తన భర్తపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. నరేశ్ కు చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలు వున్నాయని.. తనకు ఎన్నోసార్లు దొరికిపోయాడని ఆమె ఆరోపించారు. తాను నరేశ్ తోనే జీవిస్తానని.. విజయ నిర్మలకు మాటిచ్చానని, జీవితాంతం దానికి కట్టుబడే వుంటానని రమ్య స్పష్టం చేశారు.

డబ్బు కోసం రమ్య వేధిస్తోందన్న నరేశ్:

ఈ క్రమంలో నరేశ్ స్పందించారు. రమ్య చేసే ఆరోపణల్లో నిజం లేదని.. కర్ణాటకకు చెందిన ఓ ఛానెల్ తో కలిసి రమ్య ఈ రూమర్స్ వ్యాప్తి చేసిందని ఆయన ఆరోపించారు. రూ.50 లక్షల కోసం ఇంట్లో వాళ్లని వేధించిందని.. తమ కుటుంబాన్ని విడగొట్టాలని చూసిందని నరేశ్ వ్యాఖ్యానించారు. నెల క్రితమే రమ్య రఘుపతికి విడాకుల నోటీసులు పంపానని... ఆ తర్వాతే తన నాలుగో పెళ్లికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కన్నడ మీడియాకి దీనికి సంబంధించి వివరణ ఇచ్చానని నరేశ్ పేర్కొన్నారు. రమ్య రఘుపతి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.