close
Choose your channels

Super Star Krishna : ఆసుపత్రిలో సూపర్‌స్టార్ కృష్ణ.. స్పందించిన నరేశ్

Monday, November 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిగ్గజ నటుడు , సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మీడియాలో రకరకాలుగా కథనాలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై నరేశ్ స్పందించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రోటిన్ హెల్త్ చెకప్‌లో భాగంగానే కృష్ణ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని నరేశ్ పేర్కొన్నారు.

కాగా.. సూపర్‌స్టార్ కృష్ణ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో కృష్ణను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. దీంతో కృష్ణ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కృష్ణ కుటుంబంలో వరుస మరణాలు :

కాగా... ఈ ఏడాది జనవరిలో కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే ఆయన సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే కృష్ణ స్టార్‌గా ఎదుగుతున్న సమయంలో తన సహ నటి విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె కూడా 2019లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. విజయ నిర్మల, రమేశ్‌ బాబు, ఇందిరా దేవిల వరుస మరణాలతో సూపర్‌స్టార్ కృష్ణకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయ్యింది. ఐదేళ్ల క్రితం శ్రీశ్రీ చిత్రంలో నటించిన తర్వాత కృష్ణ సినిమాలకు దూరంగా వుంటూనే వస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.