close
Choose your channels

Bigg Boss 7 Telugu : ‘‘పవర్ అస్త్ర’’ అందుకున్న ఆట సందీప్, శోభా శెట్టికి నాగ్ పనిష్మెంట్.. ఏడిస్తే వుండవని వార్నింగ్

Sunday, September 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగు తొలి వీకెండ్‌కు చేరుకుంది. వారం మొత్తం ఎలా వున్నా.. ఈ రెండు రోజులు మాత్రం హౌస్ కలర్‌ఫుల్‌గా మారిపోతుంది. హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సరదాగా కబుర్లు చెప్పిస్తాడు, ఆటలు ఆడిస్తాడు. వారం రోజులు కంటెస్టెంట్స్ చేసిన తప్పుల్ని మరోసారి డిస్కస్ చేసి వారు ఆట మార్చుకునేలా చేస్తాడు. జవాన్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్‌కు రేటింగ్ ఇస్తూ వెళ్లారు. శివాజీ బాగా ఆడుతున్నాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. శోభా శెట్టిని టేస్టీ తేజ హాట్‌గా వున్నావ్ అని చెప్పడంతో ఆమెకు నాగ్ పనిష్మెంట్ ఇచ్చాడు. వారం రోజుల పాటు హౌస్‌లో వున్న అన్ని వాష్ రూమ్స్ క్లీన్ చేయాలని ఆదేశించాడు. అలాగే ఎప్పుడూ ఏడుస్తుంటే ప్రేక్షకులకు నచ్చదని.. వారిని టాప్ 5లో వుంచరని శోభకు నాగ్ వార్నింగ్ ఇచ్చాడు. రతిక, పల్లవి ప్రశాంత్ బాగా ఫర్ఫామ్ చేశారని ప్రశంసించారు.

ఫ్యాన్ పల్స్‌లో 80 మార్కులతో రతిక ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినట్లు నాగ్ చెప్పారు. ఆ తర్వాత ప్రియాంక (71), శివాజీ (74), దామిని (62), ప్రిన్స్ (69), షకీలా (69), సందీప్ (72), శోభా శెట్టి (76), టేస్టీ తేజ (77), రతిక (80), గౌతమ్ (60), కిరణ్ రాథోడ్ (50), ప్రశాంత్ (74), శుభశ్రీ (65), అమర్‌దీప్ చౌదరి (60)లు నిలిచారు.

అనంతరం పవర్ అస్త్ర సాధించిన వారే హౌస్‌మేట్‌గా కన్ఫర్మ్ అవుతారని చెప్పిన నాగ్.. కంటెస్టెంట్స్‌కి టాస్క్ పెట్టాడు. పవర్ అస్త్రలో ఫైనల్‌కి చేరిన ఆట సందీప్, ప్రియాంక జైన్‌లకు ఆసక్తికర టాస్క్ ఇచ్చాడు. బల్లపై ఓ వైపు సందీప్, మరోవైపు ప్రియాంక నిల్చోవాలి. వీరి మధ్యలో స్మైలీ బాల్స్ వుంటాయి. ఆ బాల్స్‌ని తీసుకుని బల్లపై నుంచి కింద పడకుండా ఎవరి బుట్టలో వాళ్లు వేయాలి. ఎవరైతే ఎక్కువ వేస్తారో వారే విజేత. ఈ టాస్క్‌లో ఆట సందీప్ విజయం సాధించాడు. అంతేకాదు.. బిగ్‌బాస్ 7లో తొలి హౌస్‌మేట్ అయిపోయాడు. అతనికి నాగ్ పవర్ అస్త్ర అందించారు.

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 7న మొదటి వారం నామినేషన్‌లో ఉన్న ఒకరు ఎలిమినేట్‌ అయ్యే సమయం వచ్చింది. ఈ వారం దామిని, గౌతమ్‌ కృష్ణ, కిరణ్‌ రాథోడ్, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభా శెట్టి నామినేషన్‌లో ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్‌లో వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. అయితే తొలి వారం ఎలిమినేషన్ వుంటుందా.. లేదా అన్నది మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఈవారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారని టాక్. మరి అది ఎంత వరకు నిజమో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.