close
Choose your channels

హీరో ఆది కొత్త చిత్రం.. కీలక పాత్రలో సునీల్ !

Friday, June 18, 2021 • తెలుగు Comments

హీరో ఆది కొత్త చిత్రం.. కీలక పాత్రలో సునీల్ !

హీరో ఆది సాయికుమార్ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 2011లో ప్రేమ కావాలి చిత్రంతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకావాలి చిత్రం ఘనవిజయం సాధించింది. టాలీవుడ్ కి కొత్త ప్రామిసింగ్ హీరోగా ప్రశంసలు దక్కించుకున్నాడు ఆది. కానీ ఆ తర్వాత కథల ఎంపిక సరిగా లేకపోవడం వల్ల కాస్త వెనుకబడ్డాడు.

ఇదీ చదవండి: ప్రభాస్ 'రాధే శ్యామ్' లో ఊహకు అందని కోణం..

ఆది తదుపరి చిత్రం గురించి ఆసక్తికర ప్రకటన వచ్చింది. 'నాటకం' చిత్రంతో గుర్తింపు పొందిన కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది తదుపరి చిత్రం ఖరారైంది. వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

విభిన్నమైన కథతో ఈ చిత్రం తెరకెక్కబోతోందట. సునీల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నాడు. ఆ రోల్ కి సునీల్ మాత్రమే సరిపోతాడని చిత్ర యూనిట్ అతడిని సంప్రదించింది. సునీల్ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.. ఆయనకు థ్యాంక్స్ అని నిర్మాత అన్నారు.

ఈ చిత్రాన్ని మా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం. సాయి కార్తీక్ సంగీతం అందించనుండగా, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా ఎంపికయ్యారు. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం అని నిర్మాత తెలిపారు.

Get Breaking News Alerts From IndiaGlitz