Pan Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‌కు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే ..?
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ - ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరిగా వుండాలని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం దశల వారీగా గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం.. మార్చి 31 తుది గడువుగా తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (సీబీడీటీ) మంగళవారం ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అప్పటికీ పాన్ ఆధార్ లింక్ చేయకుంటే జూలై 1 నుంచి పాన్‌కార్డ్ నిరుపయోగంగా మారుతుందని స్పష్టం చేసింది. అయితే దేశంలో ఇప్పటి వరకు 51 కోట్ల మంది తమ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నట్లు పేర్కొంది.
ఆధార్‌తో పాన్ లింక్ చేస్తే లాభాలివే:
ఐటీఆర్ ఫైల్ చేయడం సులభం
ట్రాన్సాక్షన్ల రిసిప్ట్‌లు, ఈ సిగ్నేచర్ వంటివి ఆదాయపు పన్ను శాఖకు అందించాల్సిన పని వుండదు
పాన్‌కార్డ్‌తో జరిగే మోసాలకు చెక్
మీ పేరుపై ఎవరైనా ఆధార్ తీసుకున్నా అది రద్దవుతుంది
ఆధార్‌తో పాన్ లింక్ చేయకుంటే :
బ్యాంక్ అకౌంట్, డీమ్యాట్ ఖాతా తెరవలేరు
మ్యూచువల్ ఫండ్లలో మదు చేయలేరు
టీడీఎస్ విధించాల్సిన చోట పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది
స్టాక్ మార్కెట్‌కు సంబంధించి పాన్ ఆధార్ అనుసంధానం లేనిపక్షంలో కేవైసీ నిబంధనలు పాటించనట్లుగా భావించి పెట్టుబడులపై పరిమితులు విధించొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments