close
Choose your channels

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

Tuesday, June 30, 2020 • తెలుగు Comments

మ‌హేశ్ కోసం భారీ సెట్‌!!

మాయదారి క‌రోనా అని సినీ జ‌నాలు క‌రోనా గురించి తెగ తిట్టుకుంటున్నారు. కోవిడ్ 19 ప్ర‌భావంతో బాగా ఇబ్బందులు ప‌డుతున్న రంగాల్లో సినీ రంగం ముందు వ‌రుస‌లో ఉంది. షూటింగ్స్‌కు అనుమ‌తులు ల‌భించినా ఆ విధి విధానాల్లో షూటింగ్స్ జ‌రుపుకోలేక వ‌చ్చే ఇబ్బందులు ఒక వైపు, మరో వైపు క‌రోనా భ‌యం ఇంకా పూర్తిగా తొల‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ సెట్స్‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు. ఒక‌వేళ షూటింగ్స్ ప్రారంభించినా హైద‌రాబాద్ ప‌రిస‌రాల‌ను వ‌దిలి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో స్టూడియ‌ల్లోనే భారీ సెట్స్ వేసి చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌నుకుంటున్నారు.

అందులో భాగంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఓ బ్యాంక్ సెట్‌ను వేస్తున్నార‌ని స‌మాచారం. దేశంలోని బ్యాంకుల‌ను మోసం చేసి విదేశాల‌కు వెళ్లిపోయిన విల‌న్‌ను ఇండియాకు రప్పించడానికి హీరో ఏం చేశాడ‌నేదే క‌థ అని సినీ వ‌ర్గాల స‌మాచారం.

మ‌హేశ్‌, ప‌రుశురామ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ‘స‌ర్కారు వారి పాట‌’ సెట్స్‌కు వెళ్ల‌డానికి స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై సినిమా నిర్మితం కానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్‌.

Get Breaking News Alerts From IndiaGlitz