close
Choose your channels

'90ml'  'సింగిలు సింగిలు' పాట సుజనా మాల్ లో విడుదల

Sunday, November 17, 2019 • తెలుగు Comments

హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ చిత్రంలో నటించిన రోల్ రైడా మరియు దర్శకుడు శేఖర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో ప్రాంగణమంతా ఈలలు, అరుపులతో ఉర్రూతలూగిపోయింది. ఇదివరకు విడుదలైన 'ఇనిపించుకోరు ఇనిపించుకోరు' 'చాలు చాలు' పాటలు ఇప్పటికే జనాల నుండి మంచి ఆదరణ పొందుతుండగా ఇప్పుడు విడుదలయిన ఈ పాట సింగిలు సింగిలు అని సాగుతూ సింగిల్ యువతని విపరీతంగా ఆకట్టుకోనుంది.

ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి గుమ్మకొండ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తుండగా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలకి సిద్ధంగా ఉంది.

న‌టీన‌టులు: కార్తికేయ‌, నేహా సోలంకి, ర‌వికిష‌న్‌, రావు ర‌మేష్‌, అజయ్ , ఆలీ , ప్ర‌గ‌తి, ప్ర‌వీణ్‌, కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, అదుర్స్ ర‌ఘు, స‌త్య ప్ర‌కాష్‌, రోల్ రిడా, నెల్లూర్ సుద‌ర్శ‌న్‌, దువ్వాసి మోహ‌న్‌.

Get Breaking News Alerts From IndiaGlitz