రఘు కుంచె సమక్షంలో ‘గామా అవార్డ్స్ 2025’ ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్


Send us your feedback to audioarticles@vaarta.com


‘గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్(గామా అవార్డులు -Gama -2025) గల్ఫ్ దేశాల్లో రెండో అతి పెద్ద దేశమైన ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’లోని దుబాయ్ సిటీ వేదికగా కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అవార్డ్స్ ప్రోగ్రాం ఎప్పుడు నిర్వహించేది ఆర్గనైజర్స్ వెల్లడించారు.
గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె (RagunKunche)సమక్షంలో ‘గామా అవార్డ్స్ 2025’ ఐదవ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ జరిగింది. దుబాయ్‌లోని అజ్మాన్, మైత్రి ఫార్మ్‌లో నిర్వహించిన ఆ వేడుకకు సుమారు 500 మందికి పైగా తెలుగు ప్రజలు హాజరు అయ్యారు. ఈ వేదికగా కార్యక్రమం వివరాలు వెల్లడించారు.
ఇప్పటి వరకు గామా అవార్డ్స్ నాలుగుసార్లు జరిగాయి. ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులను అవార్డులు అందజేశారు. కరోనా కారణంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ... దుబాయ్ సిటీలో భారీ ఎత్తున తెలుగువారి సమక్షంలో ఈ అవార్డ్స్ వేడుక నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ‘గామా అవార్డ్స్’ను జూన్ 7వ (Gama awards on 7th july) తేదీన దుబాయ్ షార్జా ఎక్స్పో (Dubai Sharja Expo) సెంటర్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
‘గామా అవార్డ్స్’ కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ దర్శకులు ఎ కోదండ రామిరెడ్డితోపాటు సంగీత దర్శకుడు కోటి, దర్శకుడు బి గోపాల్ సహా మరికొందరు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ అవార్డుల వేడుకకు వచ్చే అతిథి లతోపాటు వీరి చేతుల మీదుగా అవార్డు అందజేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com