చిన్న చిత్రాలు... మంచి వసూళ్లు...
2017..ముగియ వస్తుంది. సినిమా రంగం విషయానికి వస్తే ఈ ఏడాది సినిమాల విషయంలో ఫలితం ఆశాజనంగానే ఉన్నాయి. ఓ వైపు పెద్ద సినిమాలే కావు.. చిన్న సినిమాలు కూడా తమ ట్రేడ్ మార్కు విజయాలను సాధించాయి.
ఏడాది ప్రారంభంలోనే చిన చిత్రాల విజయాలకు బీజం వేసింది మాత్రం `శతమానం భవతి`. శర్వానంద్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోల సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో పోటీకి వచ్చింది. వాటికి ధీటుగా కలెక్షన్స్ ను సాధించింది ఔరా! అనిపించుకుంది.
ఫిబ్రవరిలో నాని నటించిన నేను లోకల్, రానా నటించిన ఘాజీ చిత్రాలు భారీ అంచనాలతో కాకుండా.. హంగామా లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టుకున్నాయి. ముఖ్యంగా తొలి సబ్ మెరైన్ కథతో రూపొందిన ఘాజీకి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.
మార్చి చాలా చిన్న చిత్రాలే వచ్చినా రాజ్ తరుణ్ నటించిన కిట్టుఉన్నాడు జాగ్రత్త సినిమా మార్చి ప్రథమ వారంలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
ఏప్రిల్ లో ఏ చిన్న సినిమాకు ఆశాజనకమైన ఫలితం రాలేదు. శ్రీని అవసరాల.. బాబుబాగా బిజీ, శర్వానంద్..రాధ చిత్రాలు మే నెలలో విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. నిఖిల్ నటించిన కేశవ, నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం వసూళ్ల పరంగా వేడుకను తెచ్చిపెట్టాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ నవ్వుల విందును పంచి పెట్టి.. భారీ లాభాలను సొంతం చేసుకుంది.
ఇక ఏడాది ద్వితీయార్థంలో జూలై నెల చిన్న చిత్రాలకు సక్సెస్ నెలగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నెలలో నిన్నుకోరి, శమంతకమణి చిత్రాలు హిట్ చిత్రాలుగా నిలిస్తే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సెన్సేషనల్ హిట్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కి వచ్చిన తొలి కమర్షియల్ సక్సెస్ కూడా ఇదే అనొచ్చు. ఈ చిత్రం యాబై కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టుకుంది. తెలంగాణ పోరి భానుమతిగా సాయిపల్లవి కుర్రకారు హృదయాలను ఈ చిత్రంతోనే కొల్లగొట్టింది.
ఫిదా ఊపును ప్రేక్షకులు మరచిపోక ముందే ఆగస్టులో వచ్చిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పెళ్ళిచూపులు చిత్రంతో హీరోగా ప్రూవ్ చేసుకున్న విజయ్ దేవరకొండ..అర్జున్ రెడ్డితో అందరి దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా కూడా 50 కోట్ల బడ్జెట్ లిమిట్‌ను దాటేయడమే కాదు..ట్రెండ్ మార్క్ మూవీ అని విమర్శకుల ప్రశంసలు దక్కించుకంది.
ఇదే నెలలో విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా డైరెక్టర్ తేజకు కమ్ బ్యాక్ మూవీగా నిలిస్తే..రానాకు ఇదే ఏడాది బాహుబలి2, ఘాజీ సక్సెస్ ల తర్వాత హ్యాట్రిక్ హిట్‌ను తెచ్చిపెట్టింది. సెప్టెంబర్ నెలేంటి ఊసురుమనిపించేలా ఉందే అని అనుకుంటున్న తరుణం..దసరా సందర్భంగా విడుదలైన పెద్ద సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇక సెప్టెంబర్ నిరాశ పెట్టేస్తుందేమోనని అనుకుంటున్న సమయంలో ఓసీడీ సమస్యతో శర్వానంద్, మారుతి చేసిన `మహానుభావుడు` చిత్రం సూపర్ హిట్ తో చిన్న చిత్రాల సక్సెస్ ట్రాక్ కు బ్రేక్ రాకుండా అడ్డుకుంది.
అయితే అక్టోబర్ మాత్రం చిన్న చిత్రాలకు పెద్దగా కలిసి రాలేదు. రవితేజ, నాగార్జున వంటి స్టార్స్ కే కలిసొచ్చింది.
నవంబర్ మొదటి వారంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన `పిఎస్వి గరుడవేగ` సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు...చాలా సంవత్సరాలుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న డా.రాజశేఖర్ కు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. పెళ్లిచూపులు చిత్రంతో నిర్మాతగా సక్సెస్ కొట్టిన సురేష్ బాబు, రాజ్ కందుకూరిలు నవంబర్‌లో వచ్చిన `మెంటల్ మదిలో` అనే చిన్న చిత్రంతో మరో డీసెంట్ హిట్ ను అందుకున్నారు.
ఏడాది చివరి నెల డిసెంబర్...చిన్న చిత్రాలకు పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా డిసెంబర్ రెండో వారంలో ఏకంగా పదిహేను సినిమాలు ఏక కాలంలో విడుదలైన ఒక సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకోలేదు.
ఇక మినిమమ్ బడ్జెట్ తో రూపొందిన ఎంసీఏ తో కూడా 30 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకునే దిశగా పరుగులు తీస్తుంది. ఈ సినిమా సక్సెస్ తో దిల్ రాజుకు డబుల్ హ్యాట్రిక్ మూవీ కొట్టిన నిర్మాత అయ్యాడు. అలాగే సునీల్ టు కంట్రీస్, అల్లు శిరీష్ ఒక్క క్షణం సినిమాలు చిన్న చిత్రాల బరిలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాయి.

2017..ముగియ వÂస్తుంది. సినిమా రంగం విషÂయానికి వÂస్తే ఈ ఏడాది సినిమాల విషÂయంలో ఫÂలితం ఆశాజÂనంగానే ఉన్నాయి. ఓ వైపు పెద్ద సినిమాలే కావు..చిన్న సినిమాలు కూడా తÂమ ట్రేడ్ మార్కు విజÂయాలÂను సాధించాయి.
Comments